యూఏఈలో చిక్కుకున్న భారత ప్రవాసులకు ఉచిత వసతి!

ABN , First Publish Date - 2020-12-26T12:48:10+05:30 IST

సౌదీ అరేబియా, కువైత్‌ దేశాలు సరిహద్దుల ను మూసివేసిన దరిమిలా వందల సంఖ్యలో విదేశీయులు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) చిక్కుకుపోయారు. కొత్త రకం వైర్‌సను అడ్డుకునే చర్యల్లో భాగంగా సౌదీ, కువైత్‌లు తమ దేశాల సరిహద్దులను మూసివేసింది.

యూఏఈలో చిక్కుకున్న భారత ప్రవాసులకు ఉచిత వసతి!

రియాద్‌, డిసెంబరు 25: సౌదీ అరేబియా, కువైత్‌ దేశాలు సరిహద్దుల ను మూసివేసిన దరిమిలా వందల సంఖ్యలో విదేశీయులు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) చిక్కుకుపోయారు. కొత్త రకం వైర్‌సను అడ్డుకునే చర్యల్లో భాగంగా సౌదీ, కువైత్‌లు తమ దేశాల సరిహద్దులను మూసివేసింది. విమానాలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో యూఏఈలో చిక్కుకుపోయిన 300 మంది ప్రవాసులకు అధికారులు ఉచిత వసతి కల్పించా రు. స్వదేశం నుంచి సౌదీ, కువైత్‌లకు నేరుగా విమానాలు రద్దు కావడంతో ప్రత్యామ్నాయ మార్గంలో యూఏఈ మీదుగా వెళ్తూ చిక్కుకుపోయారు. 


Updated Date - 2020-12-26T12:48:10+05:30 IST