ఫ్రాన్స్‌ను వణికిస్తున్న కరోనా.. ఒక్కరోజులోనే..

ABN , First Publish Date - 2020-03-24T22:15:42+05:30 IST

కొవిడ్-19(కరోనా) మహమ్మారి చైనా తరువాత ఎక్కువగా యూరప్ దేశాల్లోనే తన ప్రభావం చూపిస్తోంది.

ఫ్రాన్స్‌ను వణికిస్తున్న కరోనా.. ఒక్కరోజులోనే..

ప్యారిస్: కొవిడ్-19(కరోనా) మహమ్మారి చైనా తరువాత ఎక్కువగా యూరప్ దేశాల్లోనే తన ప్రభావం చూపిస్తోంది. ఒకపక్క ఇటలీలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య చైనాను దాటేసిన విషయం తెలిసిందే. ఇక మరోపక్క ఫ్రాన్స్‌ ప్రభుత్వం వారం ముందే లాక్ డౌన్ ప్రకటించినప్పటికి మరణాల సంఖ్య మాత్రం తగ్గకపోవడం కలవరపెడుతోంది. ఒక్క సోమవారం రోజే ఫ్రాన్స్‌లో కరోనా కారణంగా 186 మంది చనిపోయినట్టు ఫ్రెంచ్ హెల్త్ అథారిటీలు వెల్లడించాయి. దీంతో ఫ్రెంచ్ వ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 860కి చేరింది.


ఫ్రాన్స్ వ్యాప్తంగా 19,856 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఆలివియర్ వేరన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం 2,082 మంది సీరియన్ కండీషన్‌లో ఉన్నారని తెలిపారు. ఫ్రాన్స్ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించి వారం రోజులు దాటింది. అయినప్పటి కి కరోనాను నియంత్రించడం సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా వైరస్ ప్రభావం ప్యారిస్.. ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. తాజా లెక్కలను పరిశీలిస్తే... ఫ్రాన్స్‌లో 19,856 కేసులు నమోదు కాగా.. ఇందులో 6,200 కేసులు ప్యారిస్.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. దీంతో ప్యారిస్‌లో నియంత్రణ చర్యలు చేపట్టారు. మార్చి 19న 10,995గా ఉన్న ఈ సంఖ్య నాలుగు రోజుల్లోనే దాదాపు 20 వేలకు చేరుకుంది.

Updated Date - 2020-03-24T22:15:42+05:30 IST