అమెరికాలో తెలుగు విద్యార్థినుల పెద్దమనసు.. పేదల కోసం!

ABN , First Publish Date - 2020-08-02T01:37:19+05:30 IST

కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలిచేందుకు మంచి మనసున్న చాలా మంది ముందుకొచ్చారు. ఇదే సమయంలో చాలా స్వచ్ఛంద

అమెరికాలో తెలుగు విద్యార్థినుల పెద్దమనసు.. పేదల కోసం!

కాలిఫోర్నియా: కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలిచేందుకు మంచి మనసున్న చాలా మంది ముందుకొచ్చారు. ఇదే సమయంలో చాలా స్వచ్ఛంద సంస్థలు పేదలను ఆదుకున్నాయి. ఈ క్రమంలోనే కాలిఫోర్నియాలోని శాన్ రమోన్‌కు చెందిన నలుగురు తెలుగు విద్యార్థినులు నందిని మంచికలపూడి, మోనితా గోపి, సాత్విక బొమ్మదేవర, శ్రేయ కొల్లిపర.. కూడా పెదలను ఆదుకునేందకు వినూత్నంగా ఆలోచించారు. సుమారు 60 గంటల సమయాన్ని కేటాయించి.. ఇంగ్లీష్, మ్యాథ్స్, క్రియేటివ్ రైటింగ్, స్పీచ్, డిబేట్స్ లాంటి తదితర అంశాల్లో చిన్నారులకు ట్యూషన్స్ చెప్పారు.


తద్వారా సుమారు 400 డాలర్లను సంపాదించి.. ఆ మొత్తాన్ని నాట్స్ ద్వారా కాలిఫోర్నియా కాంకర్డ్‌లోని ఫుడ్ బ్యాంక్‌కు విరాళంగా అందించారు. కాగా.. ఈ ఫుడ్ బ్యాంక్ పేదల ఆకలి తీర్చడం కోసం పని చేస్తుంది. ఈ సందర్భంగా ఫుడ్ బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ.. నలుగురు విద్యార్థినులను ప్రశంసించారు. ఈ నలుగిరి సేవాభావం.. మరింత మందికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇదిలా ఉంటే.. నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, తన పదవికాలం చివరి రోజు వరకు.. నాట్స్ ఉన్నతిని పెంచడం కోసం కృషి చేస్తున్నారు. తాజాగా పేదలను ఆదుకునేలా ఈ నలుగురు విద్యార్థినులను ఆయన  ప్రోత్సహించారు. కాగా.. ఫుడ్ బ్యాంక్‌కు విరాళం అందించిన విద్యార్థినులకు నాట్స్.. ప్రశంసా పత్రాలు అందించింది. 


శాన్ రమోన్‌లో నాట్స్ విభాగం..

బే ఏరియాలోని శాన్ రమోన్‌లో నాట్స్ విభాగం ఏర్పాటుకు స్థానికులు ముందుకొచ్చారు. నాట్స్ సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన నలుగురు తెలుగు విద్యార్థినులతో పాటు.. స్థానికంగా ఉండే తెలుగు కుటుంబాలు నాట్స్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఉత్సాహాం చూపించాయి. ఇదే విషయాన్ని ఆ కుటుంబాలు నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో బే ఏరియా, శాన్ రమోన్‌లో త్వరలో నాట్స్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి చెప్పారు. కాగా.. శాన్ రమోన్‌లో నాట్స్ విభాగం ఏర్పాటుకు రాగ బోడపాటి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. 


Updated Date - 2020-08-02T01:37:19+05:30 IST