అక్టోబర్‌లో దుబాయ్ నుంచి 4 ప్రత్యేక విమానాలు..

ABN , First Publish Date - 2020-09-18T12:56:54+05:30 IST

'వందే భారత్ మిషన్'‌లో భాగంగా అక్టోబర్‌లో దుబాయ్ నుంచి పూణేకు నాలుగు ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

అక్టోబర్‌లో దుబాయ్ నుంచి 4 ప్రత్యేక విమానాలు..

పూణే: 'వందే భారత్ మిషన్'‌లో భాగంగా అక్టోబర్‌లో దుబాయ్ నుంచి పూణేకు నాలుగు ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ విమాన సర్వీసుల ద్వారా 350 మంది భారత ప్రవాసులు పూణేకు తిరిగి రానున్నారని ఎయిరిండియా అధికారులు తెలిపారు. "ఈ నెలలో మూడు విమానాల ద్వారా 154 మందిని దుబాయ్ నుంచి పూణేకు తరలించాం. మరో విమానం సెప్టెంబర్ 24న పూణేకు రానుంది. అలాగే అక్టోబర్ మాసంలో మరో నాలుగు ప్రత్యేక విమానాలు దుబాయ్ నుంచి పూణేకు రానున్నాయి. వీటి ద్వారా 350 మంది ప్రయాణికులు పూణేకు చేరుకుంటారు. అక్టోబర్ 1, 8, 15, 22 తేదీల్లో ఈ విమానాలు పూణేకు వస్తాయి" అని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు చెప్పారు. 

Updated Date - 2020-09-18T12:56:54+05:30 IST