ప్యారీస్‌లో అలజడి సృష్టించిన దుండగులు!

ABN , First Publish Date - 2020-09-25T22:41:30+05:30 IST

ప్యారీస్‌లో గుర్తు తెలియని దుండగులు అలజడి సృష్టించారు. ఫ్రెంచ్ సెటైరికల్ మ్యాగజైన్ చార్లీ హెబ్డో‌ పాత కార్యాలయం

ప్యారీస్‌లో అలజడి సృష్టించిన దుండగులు!

ప్యారీస్: ప్యారీస్‌లో గుర్తు తెలియని దుండగులు అలజడి సృష్టించారు. ఫ్రెంచ్ సెటైరికల్ మ్యాగజైన్ చార్లీ హెబ్డో‌ పాత కార్యాలయం సమీపంలో.. ప్రజలపై కొందరు దుండగలు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 


Updated Date - 2020-09-25T22:41:30+05:30 IST