యూఏఈలో 'ఈద్ అల్ అధా'కు 4రోజుల సెల‌వులు

ABN , First Publish Date - 2020-07-22T19:58:35+05:30 IST

'ఈద్ అల్ అధా'కు యూఏఈ బుధ‌వారం సెల‌వులు ఖరారు చేసింది.

యూఏఈలో 'ఈద్ అల్ అధా'కు 4రోజుల సెల‌వులు

యూఏఈ:  'ఈద్ అల్ అధా'కు యూఏఈ బుధ‌వారం సెల‌వులు ఖరారు చేసింది. ప‌బ్లిక్ సెక్టార్స్‌కు నాలుగు రోజులు సెల‌వులు ఇస్తున్న‌ట్లు యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ప్ర‌క‌టించింది. జూలై 30 నుంచి ఆగ‌స్టు 2 వ‌ర‌కు సెల‌వులు ఇచ్చిన అధికారులు తిరిగి ఆగ‌స్టు 3న ఉద్యోగులు య‌ధావిధిగా విధుల‌కు హాజ‌రు కావాల‌ని సూచించారు. ఇవే నిబంధ‌న‌లు ప్రైవేట్ సెక్టార్స్ కూడా వ‌ర్తిస్తాయ‌ని అధికారులు పేర్కొన్నారు. ఈ మేర‌కు యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ బుధ‌వారం ట్వీట్ చేసింది.  

Updated Date - 2020-07-22T19:58:35+05:30 IST