గ్రహాంతరవాసులు ఉన్నారంటూ ఇజ్రాయెల్‌ అంతరిక్ష సంస్థ మాజీ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-12-10T10:29:54+05:30 IST

గ్రహాంతర వాసులు న్నారా..? భూమిపై కోట్లాదిమంది మదిని తొలిచే ప్రశ్న ఇది. ఇప్పటి వరకూ దీనికి స్పష్టమైన సమా ధానం లభ్యం కాలేదు.

గ్రహాంతరవాసులు ఉన్నారంటూ ఇజ్రాయెల్‌ అంతరిక్ష సంస్థ మాజీ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

జెరూసలేం, డిసెంబరు 9: గ్రహాంతర వాసులు న్నారా..? భూమిపై కోట్లాదిమంది మదిని తొలిచే ప్రశ్న ఇది. ఇప్పటి వరకూ దీనికి స్పష్టమైన సమా ధానం లభ్యం కాలేదు. అయితే.. ఏమాత్రం సందేహం లేదు ఉన్నా యంటూ తాజాగా కుండబద్ధలుకొట్టేశారు ఇజ్రాయెల్‌కు చెందిన హయీమ్‌ ఈషెద్‌(87). ఆ మాట అన్నవాళ్లు ఇప్పటి వరకూ చాలా మందే ఉన్నప్పటికీ.. ఈషెద్‌ వ్యాఖ్యలు ప్రత్యేకంగానే పరిగణించాలి. ఎందుకంటే ఆయన ఏకంగా ఇజ్రాయెల్‌ అంతరిక్ష సంస్థకు సుమారు మూడు దశాబ్దాల పాటు సేవలందించిన అధికారి మరి. హీబ్రూ పత్రిక ఏడియట్‌ అహారోనాట్‌కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


‘‘గ్రహాంతరవాసులు ఉన్నా రు. అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రభుత్వాలు ఏలియన్స్‌తో ఎప్పటి నుంచో కలిసి పనిచేస్తున్నారు. మార్స్‌ (అంగా రకుడు)పై ఒక భూగర్భ కేంద్రాన్ని కూడా రెండు దేశాల తో కలిసి ఏర్పాటు చేశారు. అంతరిక్షంలో గెలాక్టిక్‌ ఫెడరేషన్‌ అనే ఒక సంస్థ ఉంది. మనుషులు తమను అంగీకరించేందుకు సిద్ధంగా లేరని ఏలియన్స్‌ భావిస్తు న్నారు. సరైన సమయంలో తమ గురించి తాము వెల్లడించాలని భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒకానొక సమయంలో పొరపాటున ఏలియన్స్‌ గురించి చెప్పబోయి ఆగిపోయారు. నేను ఈ విషయాలన్నీ ఐదేళ్ల క్రితం చెప్పి ఉంటే.. నన్ను ఆస్పత్రిలో పెట్టి ఉండేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నాకు రావాల్సిన డిగ్రీలు, అవార్డులు నాకు వచ్చాయి’’ అని ఈషెద్‌ స్పష్టం చేశారు.


కాగా.. ఈషెద్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు పేలాయి. ఈషెద్‌ రాసిన ది యూనివర్స్‌ బియాండ్‌ హారిజాన్‌ అనే పుస్తకం త్వరలో విడుదల కానుంది. ఆ పుస్తకాన్ని అమ్ము కొనేందుకు ఆయన తాజా వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు కూడా నెట్టింట వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2020-12-10T10:29:54+05:30 IST