ఏప్రిల్ 15 నుంచి భారత్‌కు ఫ్లై దుబాయ్ స్పెషల్ సర్వీసులు...
ABN , First Publish Date - 2020-04-07T20:36:21+05:30 IST
మహమ్మారి కరోనా నేపథ్యంలో భారతదేశం వ్యాప్తంగా మార్చి 14 వరకు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.

దుబాయ్: మహమ్మారి కరోనా నేపథ్యంలో భారతదేశం వ్యాప్తంగా మార్చి 14 వరకు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో 15వ తేదీ నుంచి భారత్‌కు స్పెషల్ సర్వీసులు నడపనున్నట్లు దుబాయ్‌కి చెందిన ఎయిర్‌లైన్స్ ఫ్లై దుబాయ్ ప్రకటించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం ప్రయాణాలపై విధించిన ఆంక్షలు 14 నాటికి ముగిసిపోనున్నాయని, 15 నుంచి యధావిధిగా సర్వీసులు కొనసాగుతాయని తాము భావిస్తున్నామని ఈ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. అందుకే సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. భారత్‌లో కోజికోడ్, నేదుంబస్సేరిలతో సహా 7 విమానాశ్రయాలకు సర్వీసులు నడిపిస్తామని ఫ్లై దుబాయ్ అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా విమాన టికెట్ల విక్రయాలు ప్రారంభించింది. కనీస టికెట్ చార్జీ రూ. 37,240గా నిర్ణయించింది. మొదట విజిటింగ్ వీసాపై వచ్చి దుబాయ్‌లో చిక్కుకుపోయిన వారికి, ఎమర్జెన్సీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఫ్లై దుబాయ్ అధికారులు చెప్పారు. అలాగే భారత్‌తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు కూడా విమాన సర్వీసులు నడిపించేందుకు ఈ ఎయిర్‌లైన్స్ రెడీ అయింది.