15 నుంచి విమాన టికెట్లు: ఎయిర్‌ ఏషియా

ABN , First Publish Date - 2020-04-05T08:25:52+05:30 IST

ఈ నెల 15 నుంచి విమాన టికెట్ల బుకింగ్‌ను ప్రారంభిస్తామని ఎయిర్‌ ఏషియా ప్రకటించింది. అయితే, విమాన ప్రయాణాల కొనసాగింపు విషయంలో అప్పటి పరిస్థితులకనుగుణంగా

15 నుంచి విమాన టికెట్లు: ఎయిర్‌ ఏషియా

ముంబై, ఏప్రిల్‌ 4: ఈ నెల 15 నుంచి విమాన టికెట్ల బుకింగ్‌ను ప్రారంభిస్తామని ఎయిర్‌ ఏషియా ప్రకటించింది. అయితే, విమాన ప్రయాణాల కొనసాగింపు విషయంలో అప్పటి పరిస్థితులకనుగుణంగా డీజీసీఏ ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే, ఆ సమాచారాన్ని ప్రయాణీకులకు చేరవేస్తామని చెప్పింది. ఏప్రిల్‌ 14 తర్వాత చేసే ప్రయాణాల కోసం ఎయిర్‌లైన్స్‌ సంస్థలు టికెట్ల బుకింగ్‌ ప్రారంభించుకోవచ్చని విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ గురువారం ప్రకటించారు. ఇప్పటికే ఇండిగో, స్పైస్‌జెట్‌, గోఎయిర్‌ సంస్థలు 15 నుంచి ప్రయాణాలు చేసే వారి కోసం డొమెస్టిక్‌ బుకింగ్స్‌ ప్రారంభించాయి. స్పైస్‌ జెట్‌, గోఎయిర్‌ సంస్థలు మే 1 నుంచి అంతర్జాతీయ సర్వీసుల కోసం టికెట్లు ఇస్తున్నాయి. ఏప్రిల్‌ 15 నుంచి 30 మధ్య ప్రయాణాల కోసం బుకింగ్స్‌ ప్రారంభించామని ఇండిగో, 15 నుంచి వెళ్లే వారి కోసం టికెట్లు ఇస్తున్నామని విస్తారా ఎయిర్‌లైన్స్‌ తెలిపాయి.

Updated Date - 2020-04-05T08:25:52+05:30 IST