సెప్టెంబర్ 29న అమెరికా ప్రెనిడెన్షియల్ డిబేట్..!

ABN , First Publish Date - 2020-07-28T22:40:12+05:30 IST

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి.

సెప్టెంబర్ 29న అమెరికా ప్రెనిడెన్షియల్ డిబేట్..!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొట్టమొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్ సెప్టెంబర్ 29న జరగనుంది. ఈ డిబేట్ ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌లో జరగనున్నట్టు కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్(సీపీడీ) సోమవారం ప్రకటించింది. క్లీవ్‌ల్యాండ్‌లోని హెల్త్ ఎడ్యుకేషన్ క్యాంపస్(హెచ్ఈసీ)లో ఈ డిబేట్ జరగనుందని.. వెస్టర్న్ రిజర్వ్ యూనివర్శిటి, క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ఈ డిబేట్‌కు కో-హోస్ట్‌లుగా ఉన్నట్టు పేర్కొంది. ఈ డిబేట్‌లో అధ్యక్ష పదవి రేసులో ఉన్న నాయకులిద్దరూ పాల్గొంటారు. కాగా.. అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉండగా.. డెమొక్రటిక్ పార్టీ నుంచి మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ ఉన్నారు. ఇక ఈ ఇద్దరికి సంబంధించిన రెండో డిబేట్‌ ఫ్లోరిడాలోని మియామిలో అక్టోబర్ 15న జరగనున్నట్టు సీపీడీ తెలిపింది. మూడో డిబేట్ టెన్నెస్సీలోని నాష్‌విల్లేలో అక్టోబర్ 22న జరగనున్నట్టు చెప్పింది. ఈ డిబేట్స్ మొత్తం 90 నిమిషాల పాటు సాగుతాయి. అంతేకాకుండా డిబేట్ సరిగ్గా రాత్రి 9 గంటలకు మొదలై 10.30 గంటల వరకు కొనసాగుతోంది. ఇక ఉపాధ్యక్షుల డిబేట్ విషయానికి వస్తే.. అక్టోబర్ ఏడో తేదీన యూనివర్శిటి ఆఫ్ ఊతాలో నిర్వహించనున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి మైక్ పెన్స్ ఉపాధ్యక్ష డిబేట్‌లో పాల్గొంటారు. అయితే డెమొక్రటిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష డిబేట్‌లో పాల్గొనేది ఎవరన్నది తెలియాల్సి ఉంది. 

Updated Date - 2020-07-28T22:40:12+05:30 IST