మడగాస్కర్ నుంచి ముంబాయికి చేరుకోనున్న 61 మంది భారతీయులు

ABN , First Publish Date - 2020-08-21T00:12:48+05:30 IST

మడగాస్కర్‌లో చిక్కుకున్న 61 మంది భారతీయులు మరికొద్ది గంటల్లో భారత్‌కు చేరుకోనున్నారు.

మడగాస్కర్ నుంచి ముంబాయికి చేరుకోనున్న 61 మంది భారతీయులు

అంటాననారీవో: మడగాస్కర్‌లో చిక్కుకున్న 61 మంది భారతీయులు మరికొద్ది గంటల్లో భారత్‌కు చేరుకోనున్నారు. మొట్టమొదటిసారిగా మడగాస్కర్‌లోని అంటాననారీవో నుంచి ముంబాయికి ఎయిర్ మడగాస్కర్ విమానం నడుస్తోంది. మడగాస్కర్ నుంచి భారత్‌కు వస్తున్న మొట్టమొదటి డైరెక్ట్ ఫ్లైట్ ఇదేనని మడగాస్కర్‌లోని ఇండియన్ అంబాసడర్ అభయ్ కుమార్ తెలిపారు. జూన్ నెలలోనే అంటాననారీవో నుంచి ముంబాయికి డైరెక్ట్ ఫ్లైట్ నడపాలని ఎయిర్ మడగాస్కర్ భావించినప్పటికి కరోనా కారణంగా ఆలస్యమైనట్టు తెలుస్తోంది. అంటాననారీవో నుంచి ముంబాయికి చేరుకోవడానికి ఆరున్నర గంటల సమయం పడుతుంది. ఇక మడగాస్కర్ నుంచి భారత్‌కు వచ్చే విమానంలోనే భారత్‌లో చిక్కుకున్న 160 మంది మలగాసీలు తిరిగి తమ దేశానికి వెళ్లనున్నారు. కాగా.. జూన్‌లో 85 మంది భారతీయులు వందే భారత్ మిషన్‌లో భాగంగా భారత్‌కు చేరుకున్నారు. మడగాస్కర్‌లో భారత సంతతికి చెందిన వారు దాదాపు 20 వేల మంది ఉండొచ్చని అంచనా.

Updated Date - 2020-08-21T00:12:48+05:30 IST