న్యూజిలాండ్‌లో ఐదు వారాల తర్వాత తొలిసారిగా..!

ABN , First Publish Date - 2020-09-18T23:13:58+05:30 IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కన్ను

న్యూజిలాండ్‌లో ఐదు వారాల తర్వాత తొలిసారిగా..!

విల్లింగ్టన్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కన్నుమూశారు. కాగా.. దాదాపు ఐదు వారాల తర్వాత శుక్రవారం రోజు న్యూజిలాండ్‌లో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా గత నాలుగు రోజులుగా సామాజిక వ్యాప్తికి సంబంధించిన కేసులు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గత నెలలో ఆక్లాండ్‌లో కరోనా కేసులు నమోదవ్వడంతో.. ఆ ప్రాంతంలో న్యూజిలాండ్ ప్రభుత్వం తాత్కాలికంగా లాక్‌డౌన్‌ను విధించింది. అంతేకాకుండా సెప్టెంబర్ 19న జరగాల్సిన ఎన్నికలను అక్టోబర్ 17వరకు వాయిదా వేసిన విషయం తెలిసిందే.  కాగా.. న్యూజిలాండ్‌లో ఇప్పటి వరకు దాదాపు నమోదైన కేసుల సంఖ్య 1800కు చేరింది. మహమ్మారి కారణంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-09-18T23:13:58+05:30 IST