మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఫిన్‌ల్యాండ్ ప్రధాని సనా మారిన్

ABN , First Publish Date - 2020-09-17T08:39:30+05:30 IST

భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. 1950వ సంవత్సరం సెప్టెంబర్ 17న

మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఫిన్‌ల్యాండ్ ప్రధాని సనా మారిన్

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. 1950వ సంవత్సరం సెప్టెంబర్ 17న మోదీ జన్మించారు. ఇక మోదీ పుట్టినరోజు సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాధినేతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. తాజాగా ఫిన్‌ల్యాండ్ ప్రధాని సనా మారిన్ మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ లేఖను పంపారు. ‘గురువారం పుట్టినరోజు జరుపుకుంటున్న మోదీకి నా శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను. మనమందరం ఈ కరోనా మహమ్మారి నుంచి బయట పడతామని నేను ధృడంగా నమ్ముతున్నాను. కరోనాతో పోరులో ఏ దేశానికాదేశం చర్యలు తీసుకుంటున్నప్పటికి అంతర్జాతీయ సహకారం అనేది కూడా ఎంతో అవసరం. ఇటీవలే మన రెండు దేశాల మధ్య దౌత్య సంబంధం 70 వసంతాలు పూర్తి చేసుకుంది. ఇండియా, ఫిన్‌ల్యాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు అవకాశం ఉంది’ అని సనా మారిన్ తన లేఖలో రాసుకొచ్చారు.

Updated Date - 2020-09-17T08:39:30+05:30 IST