ప్రారంభమైన ఐదో విడత ‘వందే భారత్ మిషన్’.. 23దేశాలకు ప్రత్యేక విమానాలు!

ABN , First Publish Date - 2020-08-01T21:26:17+05:30 IST

కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తరలించే ప్రక్రియ కొనసాగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి తెలిపారు. ఓ మీడియా

ప్రారంభమైన ఐదో విడత ‘వందే భారత్ మిషన్’.. 23దేశాలకు ప్రత్యేక విమానాలు!

న్యూఢిల్లీ: కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తరలించే ప్రక్రియ కొనసాగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరి తెలిపారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన  ఆయన.. ఈ రోజు (ఆగస్ట్ 1) నుంచి ఐదో విడత ‘వందే భారత్ మిషన్’ ప్రారంభమైందన్నారు. ఆగస్ట్ 31 వరకు ‘వందే భారత్ మిషన్’ 5వ దశ కొనసాగుతుందని వెల్లడించారు. ఐదో విడత ‘వందే భారత్ మిషన్’లో భాగంగా.. గల్ఫ్ దేశాలు, అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, ఫిలిప్పిన్స్, సింగపూర్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, చైనా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించనున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ‘వందే భారత్ మిషన్’లో భాగంగా ఇప్పటి వరకు 8.45లక్షల మందిపైగా భారతీయులు ఇండియాకు చేరుకున్నట్లు తెలిపారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఎక్స్‌ప్రెస్ విమానాల్లో 2.67లక్షల మంది భారత్ చేరుకోగా.. చార్టెడ్ విమానాల్లో 4.86లక్షల మంది ఇండియాకు వచ్చినట్లు వెల్లడించారు. నేపాల్, పాకిస్థాన్, భూటన్ తదితర దేశాల్లో చిక్కుకున్న భారతీయులు రోడ్డు మార్గం ద్వారా స్వదేశానికి వచ్చినట్లు వివరించారు. 


Updated Date - 2020-08-01T21:26:17+05:30 IST