‘స్టాప్‌ ది స్టీల్‌’ గ్రూపును బ్యాన్‌ చేసిన ఫేస్‌బుక్‌

ABN , First Publish Date - 2020-11-07T08:45:33+05:30 IST

స్టాప్‌ ది స్టీల్‌ (చోరీ చేయడా న్ని ఆపండి) పేరిట అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మద్దతుదారులు నిర్వహిస్తున్న అతి పెద్ద గ్రూపుపై ఫేస్‌బుక్‌ నిషేధం విధించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ‘కౌంటింగ్‌’కు వ్యతిరేకంగా

‘స్టాప్‌ ది స్టీల్‌’ గ్రూపును బ్యాన్‌ చేసిన ఫేస్‌బుక్‌

  • హింసను ప్రోత్సహిస్తుండడంతో వేటు 


ఓక్లాండ్‌, నవంబరు 6: స్టాప్‌ ది స్టీల్‌ (చోరీ చేయడా న్ని ఆపండి) పేరిట అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మద్దతుదారులు నిర్వహిస్తున్న అతి పెద్ద గ్రూపుపై ఫేస్‌బుక్‌ నిషేధం విధించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ‘కౌంటింగ్‌’కు వ్యతిరేకంగా పోరాడాలని ఆ గ్రూపులోని సభ్యులు పోస్టులు చేస్తుండడంతో ఫేస్‌బుక్‌ ఈ చర్యలు తీసుకుంది. ‘కౌంటింగ్‌’లో అవకతవకలు జరుగుతున్నాయని, రిపబ్లికన్లకు పడ్డ ఓట్లను డెమోక్రాట్లు చోరీ చేస్తున్నారని ఆ గ్రూపులో పోస్టులు కనపడ్డాయి. 3,50,000 మంది ఉన్న ఆ ఫేస్‌బుక్‌ గ్రూపులో ప్రజలను రెచ్చగొట్టి హింసను ప్రోత్సహించేలా ట్రంప్‌ మద్దతుదారులు పోస్టులు చేశారు. 


Updated Date - 2020-11-07T08:45:33+05:30 IST