కరోనాపై 22 భాషల్లో పాటలు పాడిన 14ఏళ్ల అమ్మాయి!
ABN , First Publish Date - 2020-05-09T20:33:02+05:30 IST
కరోనా వైరస్ ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ 14ఏళ్ల అ
దుబాయి: కరోనా వైరస్ ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ 14ఏళ్ల అమ్మాయి.. కరోనాపై పోరుకు తన వంతు సహకారం అందిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. దుబాయిలోని ఇండియన్ హై స్కూల్‌లో విద్యాభ్యాసం చేస్తున్న సుచెతా సతీష్.. తన పాటల ద్వారా ప్రజల్లో కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ.. ఇప్పటి వరకు అరబిక్ సహా 21 భారతీయ భాషల్లో ఆమె పాటలు పాడారు. మలయాళం, హిందీ, బెంగాలీ, తమిళ్, అస్సామీ భాషల్లో ఆమె పాడిన పాటలను ‘బ్రేక్ ద చైన్’ క్యాంపైన్‌లో భాగంగా కేరళ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అంతేకాకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆమె పాడిన పాటలను కేరళ ప్రభుత్వం ఉపయోగిస్తోంది. దుబాయిలోని ఇండియన్ హై స్కూల్‌లో నైటింగేల్‌గా గుర్తింపు పొందిన సుచెత సతీష్.. ఏకంగా 120 భాషల్లో అనర్గళంగా పాటలు పాడి సింగింగ్ కేటగిరిలో గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డ్ 2020 విజేతగా నిలిచారు.