దుబాయ్‌లో వారిద్దరికీ వంద కొరడా దెబ్బలు.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2020-10-07T17:43:52+05:30 IST

వివాహం కాకుండా శృంగారం పాల్గొన్నందుకు ప్రవాస వ్యక్తి, మహిళకు అక్కడి అబుధాబి న్యాయస్థానం వంద కొరడా దెబ్బల శిక్షను విధించింది.

దుబాయ్‌లో వారిద్దరికీ వంద కొరడా దెబ్బలు.. కారణమేంటంటే..

యూఏఈ: వివాహం కాకుండా శృంగారం పాల్గొన్నందుకు ప్రవాస వ్యక్తి, మహిళకు అక్కడి అబుధాబి న్యాయస్థానం వంద కొరడా దెబ్బల శిక్షను విధించింది. అలాగే ప్రవాసీయుడికి మరో ఏడాది జైలు శిక్ష కూడా ఖరారు చేసింది. విచారణలో ఈ యువ ప్రవాసులు తాము అక్రమ లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నట్లు అంగీకరించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ తెలిపారు. షరియా చట్టం, ఫెడరల్ పీనల్ కోడ్‌లోని ఆర్టికల్ 121/1 ప్రకారం వీరికి ఈ శిక్షను ఖరారు చేసినట్లు న్యాయస్థానం పేర్కొంది. ఇక ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం పెళ్లికానివారు అక్రమ లైంగిక సంబంధం కలిగి ఉంటే 100 కొరడా దెబ్బల శిక్ష విధించబడుతుంది. దీని ప్రకారమే ఇప్పుడు ఈ ఇద్దరు ప్రవాసులకు చెరో వంద కొరడా దెబ్బల శిక్ష విధించబడింది. అలాగే ప్రవాసీయుడికి కోర్టు అదనంగా ఏడాది జైలు శిక్ష విధించింది. 

Read more