ఆస్ట్రేలియాలో చిక్కుకున్న ఎన్నారై.. ప్రభుత్వం చొరవ చూపాలంటూ..!

ABN , First Publish Date - 2020-03-23T20:20:35+05:30 IST

ఆస్ట్రేలియాలో సంభవించిన కార్చిచ్చు నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడి.. స్వదేశానికి పయనమైన హైదరాబాదీకి కరోనా కష్టాలు తప్పడం లేదు. వివరాల్లోకి వెళితే.. హై

ఆస్ట్రేలియాలో చిక్కుకున్న ఎన్నారై.. ప్రభుత్వం చొరవ చూపాలంటూ..!

సిడ్నీ: ఆస్ట్రేలియాలో సంభవించిన కార్చిచ్చు నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడి.. స్వదేశానికి పయనమైన హైదరాబాదీకి కరోనా కష్టాలు తప్పడం లేదు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఆకాశ్ రాజ్ సక్సేనా ఆస్ట్రేలియాలో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. కాగా.. న్యూ సౌత్ వేల్స్‌లో ఉన్న అతని ఇల్లు కార్చిచ్చులో కాలిపోయింది. ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాల నుంచి బయటపడ్డ సక్సేనా.. ఏప్రిల్ 4న హైదరాబాద్‌కు రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలపై నిషేధాంక్షలు విధించడంతో ఇప్పుడు అతని ప్రయాణం రద్దయింది. దీంతో తన గోడును ఓ మీడియా సంస్థకు వెల్లడించాడు. తన తండ్రికి వయసు మీద పడిందనీ.. తన సోదరుడికి కూడా ఆరోగ్యం బాగోలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో తన పరిస్థిని వివరించేందుకు ఆస్ట్రేలియాలోని ఇండియన్ హైకమిషన్‌ను ఆశ్రయిస్తే.. అక్కడ అధికారులు అందుబాటులో లేరని చెప్పాడు. తన కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ రావడానికి తనకు అవకాశం కల్పించాలని.. ఇందుకోసం ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నాడు. 


Updated Date - 2020-03-23T20:20:35+05:30 IST