బిల్‌గేట్స్‌ను దాటేసి ప్రపంచ నెం. 2 కుబేరుడి స్థానానికి చేరిన ఇలాన్ మస్క్
ABN , First Publish Date - 2020-11-25T09:48:59+05:30 IST
టెస్లా సహ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచ సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్‌ను సైతం వెనక్కి నెట్టి రెండో

న్యూయార్క్: టెస్లా సహ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచ సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్‌ను సైతం వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకారు. ఈ మధ్యనే ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్‌ను దాటేసి మూడో స్థానాన్ని చేజిక్కించుకున్న మస్క్.. కొద్ది రోజుల్లోనే రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. ఈ 49 ఏళ్ల టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ వ్యక్తగత సంపద మంగళవారం నాడు మరో 720 కోట్ల డాలర్లు పెరిగి 12,790 కోట్ల డాలర్లకు చేరుకుంది. అమెరికన్ స్టాక్ మార్కెట్లో టెస్లా షేరు ధర అనూహ్యంగా వృద్ధి చెందడం ఇందుకు దోహదపడింది. ఈ ఏడాదిలో మస్క్ వ్యక్తిగత సంపద 10,000 కోట్ల డాలర్లకు పైగా పెరిగింది.