అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు.. ఆ ఎనిమిది రాష్ట్రాలపైనే ప్రధాన పార్టీ నేతల కన్ను!

ABN , First Publish Date - 2020-07-20T00:45:02+05:30 IST

అమెరికాలో ఒకవైపు కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంటే.. ప్రధాన పార్టీలు మాత్రం త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై దృష్టిపెట్టాయి. తిరిగి అధికారా

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు.. ఆ ఎనిమిది రాష్ట్రాలపైనే ప్రధాన పార్టీ నేతల కన్ను!

వాషింగ్టన్: అమెరికాలో ఒకవైపు కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంటే.. ప్రధాన పార్టీలు మాత్రం త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై దృష్టిపెట్టాయి. తిరిగి అధికారాన్ని కాపాడుకునేందకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం అమెరికాలో కరోనా కారణంగా ఏర్పడ్డ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా.. అమెరికన్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా.. హెచ్1బీ సహా ఇతర వీసాల జారీని డిసెంబర్ వరకు నిషేధించారు. ఇదిలా ఉంటే.. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. ట్రంప్‌ను ఓడించేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. కరోనా విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ అమెరిన్ల ఓట్లు ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. దీంతో ఇరు పార్టీల నేతలు.. అమెరికాలోని అరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, మిచిగాన్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, టెక్సాస్, విస్కాన్సిన్ రాష్ట్రాలపై దృష్టిపెట్టారు. అమెరికాలో దాదాపు 24లక్షల మంది ఇండియన్-అమెరికన్లు నివసిస్తున్నారు. ఇందులో దాదాపు 13లక్షల మంది కేవలం ఈ ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉన్నారు. అందులోనూ ఒక్క పెన్సిల్వేనియా  రాష్ట్రంలోనే అత్యధికంగా 1.56లక్షలమంది ఇండియన్- అమెరికన్ ఓటర్లు ఉండగా.. గత ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి పెన్సిల్వేనియా రాష్ట్రం 42,000 ఓట్ల ఆధిక్యాన్ని ఇచ్చింది. అలాగే మిగిలిన ఏడు రాష్ట్రాలు కూడా రిపబ్లిక్ పార్టీనే బలపర్చి, ట్రంప్ గెలుపులో ముఖ్య భూమిక పోషించాయి. ఈ నేపథ్యంలో గెలుపు, ఓటములను నిర్ణయించే ఈ ఎనిమిది రాష్ట్రాలపై పట్టు సాధించేందుకు ఇరు పార్టీల నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇండియన్-అమెరికన్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇరు పార్టీలు కృషి చేస్తున్నాయి. 


Updated Date - 2020-07-20T00:45:02+05:30 IST