చేయి చేసుకున్నాడని భర్తను పొడిచి చంపిన యువ నటి!

ABN , First Publish Date - 2020-07-10T23:40:16+05:30 IST

ఈజిప్ట్‌కు చెందిన 29ఏళ్ల ప్రముఖ నటి.. తన భర్తను పొడిచి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అబీర్ బేబార్స్

చేయి చేసుకున్నాడని భర్తను పొడిచి చంపిన యువ నటి!

కైరో: ఈజిప్ట్‌కు చెందిన 29ఏళ్ల ప్రముఖ నటి.. తన భర్తను పొడిచి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అబీర్ బేబార్స్ అనే యువ నటి.. కైరోకు ఉత్తరాన ఉన్న అల్ బసతీన్ ప్రాంతంలో తన భర్తతోపాటు ఉంటోంది. అబీర్ బేబార్స్ భర్త వ్యాపారం చేస్తుంటాడు. అయితే గత కొంత కాలంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల క్రితం వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ సందర్భంగా అబీర్ బేబార్స్‌పై తన భర్త చేయి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైన అబీర్ బేబార్స్.. పగిలి పోయిన సీసాతో తన భర్తను పొడిచి చంపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అయితే మొదట ప్రమాదవశాత్తు తన భర్త మరణించినట్లు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసిన అబీర్ బేబార్స్.. చివరికి తప్పు ఒప్పుకుంది. దీంతో ఈజిప్ట్ సెక్యూరిటీ అధికారులు అబీర్ బేబార్స్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. 


Updated Date - 2020-07-10T23:40:16+05:30 IST