రిటైరైన వారికి దుబాయి వీసా పథకం

ABN , First Publish Date - 2020-09-06T13:46:48+05:30 IST

రిటైరైన ప్రవాసులను ఆకర్షించేందుకు దుబాయి ప్రభుత్వం రెండేళ్ల క్రితం నాటి వీసా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. 55 ఏళ్లు దాటిన విదేశీయులు ఈ వీసా పొందడానికి అర్హులు. ఈ పథకం ప్రకారం వీరు ఐదేళ్లకు ఒకసారి రెన్యూవల్‌ చేసుకునే వీసాను పొందడానికి అవకాశం..

రిటైరైన వారికి దుబాయి వీసా పథకం

దుబాయి, సెప్టెంబరు 5: రిటైరైన ప్రవాసులను ఆకర్షించేందుకు దుబాయి ప్రభుత్వం రెండేళ్ల క్రితం నాటి వీసా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. 55 ఏళ్లు దాటిన విదేశీయులు ఈ వీసా పొందడానికి అర్హులు. ఈ పథకం ప్రకారం వీరు ఐదేళ్లకు ఒకసారి రెన్యూవల్‌ చేసుకునే వీసాను పొందడానికి అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఇందుకు షరతులున్నాయి. నెలవారీ ఆదాయం 20 వేల దిర్హమ్‌లు (5,445 డాలర్లు) లేదా 10 లక్షల దిర్హమ్‌ల సేవింగ్స్‌ లేదా దుబాయిలో 20 లక్షల దిర్హమ్‌ల విలువైన సొంత ప్రాపర్టీ వంటి వాటిలో ఏదో ఒకటి ఉన్నా వీసా పొందడానికి అర్హత ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో దుబాయిలో ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అనేక మంది ప్రవాసులు ఇతర దేశాలకు లేదా స్వదేశానికి వెళ్లాలనుకుంటున్నారు. దుబాయి జనాభాలో విదేశీయులే దాదాపు 90 శాతం మంది ఉంటారు. ఇక్కడ జీవనం ఖరీదైనది. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్లాలనుకునే సంపన్న రిటైరీలను ఆకర్షించేందుకు దుబాయి ప్రయత్నం చేస్తోంది. 

Updated Date - 2020-09-06T13:46:48+05:30 IST