దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ తేదీల ప్రకటన !

ABN , First Publish Date - 2020-10-14T13:59:12+05:30 IST

దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ తేదీలు వచ్చేశాయి.

దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ తేదీల ప్రకటన !

దుబాయ్: దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ తేదీలు వచ్చేశాయి. డిసెంబర్ 17, 2020 నుంచి జనవరి 30, 2021 వరకు ఈ షాపింగ్ ఫెస్టివల్ ఉంటుందని దుబాయ్ ఫెస్టివల్స్ మరియు రిటైల్ ఎస్టాబ్లిష్మెంట్(డీఎఫ్ఆర్ఈ) ప్రకటించింది. డిసెంబర్ 17న కన్సర్ట్స్, బాణసంచా ప్రదర్శనలు, మాల్స్‌లో వినోదం, తదితర కార్యక్రమాలతో ఈ షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభం అవుతుందని డీఎఫ్ఆర్ఈ వెల్లడించింది. కాగా, ఈ ఫెస్టివల్‌లో పాల్గొనే ప్రతి మాల్స్, ఈవెంట్ వేదికలు కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి స్థానిక నిబంధనలకు అనుగుణంగా ఆరోగ్య, భద్రతా ప్రమాణాలను పాటించాలని నిర్వాహకులు నొక్కి చెప్పారు.


ఇక గతేడాది జరిగిన ఈ కార్యక్రమంలో లియామ్ పేన్, జాన్ లెజెండ్, హుస్సేన్ అల్ జాస్మి వంటి 199 లైవ్ కచేరీలు ఉన్నాయి. అలాగే రాఫెల్ విజేతలకు బహుమతుల రూపంలో 70 నిస్సాన్, ఇన్ఫినిటీ కార్లు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు 50 మిలియన్ దిర్హమ్స్ విలువైన బహుమతులను నిర్వాహకులు ప్రదానం చేశారు. కాగా, గత సంవత్సరం ఈ కార్యక్రమం డిసెంబర్ 26, 2019 నుంచి ఫిబ్రవరి 1, 2020 వరకు జరిగింది. 

Updated Date - 2020-10-14T13:59:12+05:30 IST