జులై 7 నుంచి పర్యాటకులకు అనుమతి.. ఎక్కడంటే..

ABN , First Publish Date - 2020-06-22T09:17:46+05:30 IST

కరోనా మహమ్మారి అదుపులోకి రావడంతో దుబాయి ప్రభుత్వం విదేశీ పర్యాటకులకు

జులై 7 నుంచి పర్యాటకులకు అనుమతి.. ఎక్కడంటే..

దుబాయి: కరోనా మహమ్మారి అదుపులోకి రావడంతో దుబాయి ప్రభుత్వం విదేశీ పర్యాటకులకు అనుమతివ్వాలని నిశ్చయించుకుంది. కొవిడ్-19 వ్యాప్తి మొదలైన నాటి నుంచి దుబాయి పర్యాటక రంగం కుదేలైంది. విదేశీ పర్యాటకులు లేక దుబాయిలోని పర్యాటక ప్రదేశాలు వెలవెలబోతున్నాయి. అయితే ఇప్పుడు విదేశీ పర్యాటకులకు దుబాయి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జులై 7వ తేదీ నుంచి విదేశీ పర్యాటకులు దేశంలోకి రావొచ్చని తెలిపింది. రెసిడెన్సీ వీసా కలిగిన వారు జూన్ 22 నుంచే రావొచ్చని స్పష్టం చేసింది. మరోపక్క దుబాయి ప్రజలు జూన్ 23 నుంచి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చేవారు తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ అని తేలితే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని అన్నారు. గడిచిన 96 గంటల్లో తమకు కరోనా నెగిటివ్ వచ్చినట్టు పర్యాటకులు ప్రూఫ్ చూపెడితే.. వారికి ఎటువంటి పరీక్షలు నిర్వహించమని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-06-22T09:17:46+05:30 IST