కిల్ల‌ర్‌ క‌రోనాపై దుబాయ్ 'హైటెక్' పోరాటం..!

ABN , First Publish Date - 2020-03-28T14:45:49+05:30 IST

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 190కి పైగా దేశాలను మ‌హ‌మ్మారి క‌రోనావైర‌స్‌(కొవిడ్‌-19) హ‌డ‌లెత్తిస్తోంది.

కిల్ల‌ర్‌ క‌రోనాపై దుబాయ్ 'హైటెక్' పోరాటం..!

క‌రోనాపై పోరాటానికి.. హైటెక్ క్రిమిసంహారక యంత్రాలను బ‌రిలోకి దింపిన‌ దుబాయ్

దుబాయ్: ప్ర‌పంచ‌ వ్యాప్తంగా 190కి పైగా దేశాలను మ‌హ‌మ్మారి క‌రోనావైర‌స్‌(కొవిడ్‌-19) హ‌డ‌లెత్తిస్తోంది. శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైర‌స్‌ను నిలువ‌రించేందుకు ప్ర‌పంచ దేశాలు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశాయి. చాలా దేశాలు ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌కే ప‌రిమితం చేశాయి. తాజాగా అర‌బ్ దేశం దుబాయి క‌రోనాపై పోరాడటానికి హైటెక్ క్రిమిసంహారక యంత్రాలను బ‌రిలోకి దింపింది. మూడు రోజుల పాటు వీటి సహాయంతో దేశంలోని గ‌ల్లీ గల్లీని స్టెరిలైజ్ చేసే ప‌నిలో ప‌డింది. ఈ మేర‌కు దుబాయ్ మునిసిపాలిటీ గురువారం సాయంత్రం నుంచి బ‌రిలోకి దిగింది. సమగ్ర ప్రణాళికలో భాగంగా అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా అధునాతన పరికరాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బ‌హిరంగా ప్రదేశాలను స్టెరిలైజ్ చేస్తోంది. జాతీయ స్టెరిలైజేషన్ కార్యక్రమంలో భాగం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ మూడు రోజుల పాటు దీనిని నిర్వ‌హించ‌నుంది. 


ఈ సంద‌ర్భంగా దుబాయ్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ దావూద్ అల్ హజ్రీ మాట్లాడుతూ "సమాజ భద్రత మన ప్రధాన బాధ్యతలలో ఒకటి. కరోనావైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని ప్ర‌స్తుతం ప్రపంచం మొత్తం ఎదుర్కొంటోంది. ఈ కాలంలో పౌరులు, నివాసితులు, సందర్శకులకు స్థిరత్వం, భద్రతను క‌ల్పించే హామీలను అందించడంపైనే మా దృష్టి ఉంది. చాలాసార్లు మానవ ఆరోగ్యం, భద్రత మన ప్రాధాన్యతల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ అసాధారణ స‌మ‌యంలో మ‌నం ఎంతో తెగువ చూపించాల‌ని" ఆయ‌న‌ అన్నారు.

Updated Date - 2020-03-28T14:45:49+05:30 IST