అబూధాబీలో కారు ప్రమాదం.. రూ. 45 లక్షల పరిహారాన్ని చెల్లించనున్న ఇన్సూరెన్స్ సంస్థ

ABN , First Publish Date - 2020-10-07T10:31:20+05:30 IST

యూఏఈలో ఓ వ్యక్తికి చెందిన లగ్జరీ కారు యాక్సిడెంట్‌కు గురవగా

అబూధాబీలో కారు ప్రమాదం.. రూ. 45 లక్షల పరిహారాన్ని చెల్లించనున్న ఇన్సూరెన్స్ సంస్థ

అబూధాబీ: యూఏఈలో ఓ వ్యక్తికి చెందిన లగ్జరీ కారు యాక్సిడెంట్‌కు గురవగా.. 2.23 లక్షల దిర్హామ్‌లు(రూ. 44 లక్షల 69 వేలు) నష్టపరిహారంగా చెల్లించాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఇన్సూరెన్స్ సంస్థను ఆదేశించింది. కారు విలువ ఎంత ఉందో అంత నష్టపరిహారం చెల్లించాలంటూ కారు యజమాని మొదట ఇన్సూరెన్స్ సంస్థను సంప్రదించాడు. సంస్థ కుదరదని చెప్పడంతో కారు యజమాని కింది కోర్టును ఆశ్రయించాడు. కారును రిపేర్ చేసేందుకు.. రిపేర్ అయ్యేంత వరకు అదే విధమైన కారును రెంట్‌కు తీసుకునేందుకు 2.23 లక్షల దిర్హామ్‌లు సరిపోతాయని సాంకేతిక నిపుణులు కోర్టుకు వివరించారు. దీంతో ఇన్సూరెన్స్ సంస్థ కారు యజమానికి 2.23 లక్షల దిర్హామ్‌ల నష్టపరిహారం చెల్లించాలని కింది కోర్టు తీర్పునిచ్చింది. తనకు 2.23 లక్షల దిర్హామ్‌లు సరిపోవని కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కారు యజమాని అత్యున్నత న్యాయస్థానాన్ని సంపద్రించాడు. అయితే అత్యున్నత న్యాయస్థానం అతని అభ్యర్థనను తిరస్కరించింది. మునుపటి తీర్పులనే సమర్థిస్తూ అదే తీర్పును వెల్లడించింది. 


Read more