ట్రంప్‌కు ఓటెయ్యకండి!

ABN , First Publish Date - 2020-10-24T11:42:43+05:30 IST

‘దయచేసి ట్రంప్‌కు ఓటు వేయకండి. ఇదే మీరు నాకు అర్పించే ఘనమైన నివాళి’’ ఇదీ.. ఇటీవల మృతి చెందిన ఓ వృద్ధురాలి చివరి కోరిక. అమెరికాలోని మిన్నియాపొలి్‌సకి చెందిన జార్జి యా మే అడ్కిన్స్‌ అనే

ట్రంప్‌కు ఓటెయ్యకండి!

వాషింగ్టన్: ‘దయచేసి ట్రంప్‌కు ఓటు వేయకండి. ఇదే మీరు నాకు అర్పించే ఘనమైన నివాళి’’ ఇదీ.. ఇటీవల మృతి చెందిన ఓ వృద్ధురాలి చివరి కోరిక. అమెరికాలోని మిన్నియాపొలి్‌సకి చెందిన జార్జి యా మే అడ్కిన్స్‌ అనే ఓ 93 ఏళ్ల వృద్ధురాలు.. సెప్టెంబరు 28న గుండెపోటుతో మృతిచెందారు. ఆమె తన మరణానికి ముందు.. తన మనోగతాన్ని వివరిస్తూ.. మొత్తం అమెరికా ఓటర్లను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. ‘‘ట్రంప్‌ వచ్చినప్పటి నుంచి అమెరికా.. రెండు వర్గాలుగా విడిపోయింది. నేను చనిపోయాక.. ఎవరూ నా కోసం పూలు తీసుకురాకండి. అందుకు బదులుగా ట్రంప్‌ను ఓడించండి. అమెరికాను ఏకం చేయండి’’ అంటూ అమెరికన్లకు పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-10-24T11:42:43+05:30 IST