మహమ్మారి గురించి ట్రంప్‌ను ముందే హెచ్చరించిన నిపుణులు!

ABN , First Publish Date - 2020-07-20T03:44:58+05:30 IST

అమెరికాలో కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఓ చర్చనీయాంశం వెలుగులోకి వచ్చింది. కరోనా విలయం గురించి నిపుణులు అమెరి

మహమ్మారి గురించి ట్రంప్‌ను ముందే హెచ్చరించిన నిపుణులు!

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఓ చర్చనీయాంశం వెలుగులోకి వచ్చింది. కరోనా విలయం గురించి నిపుణులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ముందుగానే హెచ్చరించారా అనే ప్రశ్నకు.. శ్వేత‌సౌధంలో ఆర్థికవేత్త విధులు నిర్వర్తించన ఓ అధికారి ఔననే సమాధానం చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తోడాస్ ఫిలిప్సన్, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్ (సీఈఏ) చైర్‌పర్సన్‌గా మూడేళ్లపాటు పని చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన ఆయన.. మహమ్మారి గురించి గత ఏడాది సెప్టెంబర్‌లోనే  ఆర్థికవేత్తల బృందం ట్రంప్‌ను హెచ్చరించిందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా 41పేజీల నివేదికను కూడా సమర్పించినట్లు వెల్లడించారు. అయితే ట్రంప్ మాత్రం దాన్ని పెడచెవిన పెట్టారని ఆయన ఆరోపించారు. కాగా.. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తోడాస్ ఫిలిప్సన్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌కు ఇబ్బందికరంగా మారాయి. కాగా.. అమెరికాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 38.59లక్షలకు చేరింది. మహమ్మారి కారణంగా  1.43లక్షల మంది మరణించారు. 


Updated Date - 2020-07-20T03:44:58+05:30 IST