జో బైడెన్‌ను వెనక్కి నెట్టిన ట్రంప్..!
ABN , First Publish Date - 2020-11-04T01:39:34+05:30 IST
డెమొక్రటిక్ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి నెట్టారు. జో బైడెన్ కంటే డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారని గూగుల్ చెబుతోంది. వివరాల్లోకి వెళితే.. అత్యంత శక్తి
వాషింగ్టన్: డెమొక్రటిక్ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి నెట్టారు. జో బైడెన్ కంటే డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారని గూగుల్ చెబుతోంది. వివరాల్లోకి వెళితే.. అత్యంత శక్తివంతమైన పదవికి అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి. తమ అధ్యక్ష్యుడిని ఎన్నుకునేందుకు అమెరికన్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ అమెరికా ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. హోరాహోరీ ఎన్నికల పోరులో గెలుపు ఎవరిదో తెలుసుకునేందుకు యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఎన్నికల రేసులో ట్రంప్ కంటే జో బైడెన్ ముందున్నారని పలు సర్వే సంస్థలు ఇప్పటికే తేల్చేశాయి.
ఈ క్రమంలో గూగుల్ కీలక విషయాన్ని వెల్లడించింది. జో బైడెన్‌ను ట్రంప్ వెనక్కినెట్టినట్టు తెలిపే గణాంకాలను విడుదల చేసింది. గతకొద్ది రోజులుగా అమెరికన్లు.. ట్రంప్ గురించి ఇంటర్నెట్‌లో తెగ సర్చ్ చేశారని గూగుల్ వివరించింది. గూగుల్ సర్చ్ డేటా అనాలసిస్ ప్రకారం.. సగటున 45 శాతం మంది ఇంటర్నెట్ యూజర్లు ట్రంప్ కోసం వెతికితే.. కేవలం 23 శాతం మంది మాత్రమే బైడెన్ గురించి సెర్చ్ చేశారని గూగుల్ స్పష్టం చేసింది. అక్టోబర్ 27-31 మధ్య ఇంటర్నెట్‌లో డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌లను ఎంత మంది వెతికారో తెలియజేసే గూగుల్ ట్రెండ్స్ గ్రాఫ్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా నెబ్రాస్కా, వెర్మోంట్, అరిజోనా, వాషింగ్టన్, ఓరెగాన్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ట్రంప్ కోసం ఎక్కువగా సర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది. కాగా.. ప్రస్తుతం ఈ అంశంగా మారింది.
