ప్రతి పౌరుడి ఖాతాలో రూ. 91వేలు.. ట్రంప్ సర్కార్ నిర్ణయం!

ABN , First Publish Date - 2020-03-25T21:23:54+05:30 IST

కరోనా వైరస్.. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాపై కూడా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో సుమారు 55వే

ప్రతి పౌరుడి ఖాతాలో రూ. 91వేలు.. ట్రంప్ సర్కార్ నిర్ణయం!

వాషింగ్టన్: కరోనా వైరస్.. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాపై కూడా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో సుమారు 55వేల మంది కొవిడ్-19 బారిన పడగా.. ఇప్పటి వరుకు 784 మంది మరణించారు. ఇదిలా ఉంటే.. అమెరికా ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 పంజా విసిరింది. ఈ నేపథ్యంలో సంక్షోభం దిశగా పరుగులు పెడుతున్న ఆర్థిక వ్యవస్థను.. గాడిలో పెట్టేందుకు ట్రంప్ సర్కార్ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా 2 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. దీనికి వైట్‌హౌస్, సెనేట్ ప్రతినిధుల బృందం కూడా మద్దతు తెలిపింది.


ఈ ప్యాకేజీ వల్ల అమెరికాలోని వ్యాపారవేత్తలు, కార్మికులు, వైద్యసిబ్బంది ప్రతి ఒక్కరూ లబ్ధి పొందనున్నారు. ఇందులో 500 బిలియన్ డాలర్లను పరిశ్రమల కోసం కేటాయించనుంది. అమెరికాలోని ప్రతి ఒక్కరి ఖాతాలో సుమారు 1200 డాలర్లు (రూ.91 వేలు) జమ కానున్నాయి. అంతేకాకుండా చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికి 500 డాలర్లు (సుమారు రూ.38వేలు) ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే.. ఆధునిక అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద ఉద్దీపన ప్యాకేజీ అని నిపుణులు అంటున్నారు. కాగా.. కొవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 19వేలకు చేరింది. 4.25లక్షల మంది మహమ్మారి బారినపడ్డారు. 


Updated Date - 2020-03-25T21:23:54+05:30 IST