బుర్జ్ ఖలీఫా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఫీల్డ్ ఆస్పత్రుల ఏర్పాటు

ABN , First Publish Date - 2020-12-30T15:37:56+05:30 IST

న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగే అవకాశం ఉండటంతో ప్రజల భద్రత దృష్ట్యా దుబాయి హెల్త్ అథారిటీ(డీహెచ్ఏ)

బుర్జ్ ఖలీఫా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఫీల్డ్ ఆస్పత్రుల ఏర్పాటు

దుబాయి: న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగే అవకాశం ఉండటంతో ప్రజల భద్రత దృష్ట్యా దుబాయి హెల్త్ అథారిటీ(డీహెచ్ఏ) ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయనుంది. బుర్జ్ ఖలీఫా ప్రాంతంలో ప్రతి ఏడాది న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా మూడు ఫీల్డ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఫీల్డ్ ఆసుపత్రుల్లో లేటెస్ట్ మెడికల్ ఎక్కిప్‌మెంట్ మొత్తం ఉంచుతామని డీహెచ్ఏ ఆంబులేటరీ మొబైల్ సర్వీసెస్ డైరెక్టర్ జసీమ్ బిన్ కల్బన్ తెలిపారు. 


ఈసీజీ మెషీన్స్, వైటల్ సైన్ మెజరింగ్ ఎక్విప్‌మెంట్, ఇన్‌హేలర్స్, ఆక్సిజన్ సిలిండర్స్, సీపీఆర్ మెషీన్స్, వీల్‌చైర్స్, ఫస్ట్-ఎయిడ్ కిట్స్, కార్డియాక్ వైటల్ సైన్ మెజర్‌మెంట్ డివైజెస్, ఇతర మెడికల్ ఎక్విప‌మెంట్‌ను ఫీల్డ్ ఆస్పత్రుల్లో ఉండనున్నట్టు చెప్పారు. న్యూ ఇయర్ వేడుకలు జరిగే సమయంలో ఈ ఫీల్డ్ ఆసుపత్రుల్లో 15 మందికి పైగా డాక్టర్లు, 35 మంది నర్సులు, నాలుగు లాజిస్టిక్స్ బృందాలు, ఇతర సహాయకులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-30T15:37:56+05:30 IST