విమానాల్లో ఫొటోలు తీస్తే.. 2 వారాల పాటు వేటు: డీజీసీఏ

ABN , First Publish Date - 2020-09-13T13:10:25+05:30 IST

అనుమతి లేకుండా ఎవరైనా విమానాల్లో ఫొటోలు తీస్తే ఆ విమాన సర్వీసును రెండు వారాల పాటు రద్దు చేస్తామని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) స్పష్టం చేసింది.

విమానాల్లో ఫొటోలు తీస్తే.. 2 వారాల పాటు వేటు: డీజీసీఏ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12 : అనుమతి లేకుండా ఎవరైనా విమానాల్లో ఫొటోలు తీస్తే ఆ విమాన సర్వీసును రెండు వారాల పాటు రద్దు చేస్తామని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) స్పష్టం చేసింది. చండీగఢ్‌-ముంబై ఇండిగో విమానంలో కరోనా నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకుండా నటి కంగనా రనౌత్‌ను విలేకరులు చుట్టుముట్టి అత్యుత్సాహం ప్రదర్శించిన సం గతి తెలిసిందే. దీనిపై దుమారం రేగడంతో ఆగ్రహించిన డీజీసీఏ తాజా నిర్ణయం వెలువరించింది. విమానంలో భౌతిక దూరం పాటించకుండా నిబంధనలు ఉల్లంఘించిన ఘటనపై ఇండిగో సంస్థ నుంచి వివరణ కోరింది.  

Updated Date - 2020-09-13T13:10:25+05:30 IST