ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థపై సైబర్‌ దాడి

ABN , First Publish Date - 2020-12-10T10:26:01+05:30 IST

ఐరోపా సమాఖ్య(ఈయూ)లో ఔషధాలను ఆమోదించే సంస్థ యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ(ఈఎంఏ)పై తాజాగా సైబర్‌ దాడి జరిగింది.

ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థపై సైబర్‌ దాడి

లండన్‌, డిసెంబరు 9: ఐరోపా సమాఖ్య(ఈయూ)లో ఔషధాలను ఆమోదించే సంస్థ యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ(ఈఎంఏ)పై తాజాగా సైబర్‌ దాడి జరిగింది. ఈమేరకు సంస్థ బుధవారం ప్రకటించింది. ‘‘ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నందున ఈ ఘటన గురించి అదనపు వివరాలను ఇప్పుడే వెల్లడించలేం. త్వరలోనే అన్ని విషయాలను చెబుతాం’’ అని పేర్కొంది. వ్యాక్సిన్‌ విషయంలో పలు దాడులు జరుగుతాయని ఇప్పటికే ఇంటర్‌పోల్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈఎంఏపై సైబర్‌ దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2020-12-10T10:26:01+05:30 IST