ఈ గిటార్ ధర రూ.46.5 కోట్లు..!

ABN , First Publish Date - 2020-06-22T14:20:51+05:30 IST

ప్రఖ్యాత గిటార్‌ వాద్యకారుడు కర్ట్‌ కొబెయిన్‌.. ‘ఎంటీవీ అన్‌ప్లగ్‌డ్‌’ షోలో వాడిన గిటార్‌ రికార్డు ధర పలికింది. ఆదివారం ఇక్కడ బెవెర్లీహిల్స్‌ లో జరిగిన మ్యూజిక్‌ ఐకా

ఈ గిటార్ ధర రూ.46.5 కోట్లు..!

  • వేలంలో రూ. 46.5 కోట్లకు అమ్మకం


లాస్‌ఏంజెల్స్‌: ప్రఖ్యాత గిటార్‌ వాద్యకారుడు కర్ట్‌ కొబెయిన్‌.. ‘ఎంటీవీ అన్‌ప్లగ్‌డ్‌’ షోలో వాడిన గిటార్‌ రికార్డు ధర పలికింది. ఆదివారం ఇక్కడ బెవెర్లీహిల్స్‌ లో జరిగిన మ్యూజిక్‌ ఐకాన్స్‌ కార్యక్రమంలో ఐకానిక్‌ వస్తువులను వేలంలో ఉంచారు. వీటిలో కర్ట్‌ కొబెయిన్‌ గిటార్‌ రూ.46.5 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టిం చింది. గ తేడాది వేలంలో డేవిడ్‌ గిల్మార్‌ గిటార్‌ రూ. 30.10 కోట్లకు అమ్ముడుపోగా, ఇప్పుడు ఆ రికార్డును  అధిగమించింది. 1993లో న్యూయార్క్‌లో జరిగిన ‘ఎం టీవీ అన్‌ప్లగ్‌డ్‌’ షోలో కొబెయిన్‌ ఈ గిటార్‌ను ప్లే చేశా రు. ఆ తర్వాత 5 నెలలకే 27వ ఏట మరణించారు. ఆ తర్వాత గిటార్‌ ఆయన కుమార్తె ఆధీనంలో ఉండేది. 


Updated Date - 2020-06-22T14:20:51+05:30 IST