కొవిడ్-19: భయంకరమైన నిజాలు చెప్పిన అమెరికన్ వైద్యులు

ABN , First Publish Date - 2020-05-13T21:36:59+05:30 IST

కొవిడ్-19 ఊపిరితిత్తుల వ్యాధి కంటే భయంకరమైనదని అమెరికన్ వైద్యులు

కొవిడ్-19: భయంకరమైన నిజాలు చెప్పిన అమెరికన్ వైద్యులు

ఫ్లోరిడా: కొవిడ్-19 ఊపిరితిత్తుల వ్యాధి కంటే భయంకరమైనదని అమెరికన్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరగడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే.. కరోనా సోకిన వారి శరీర అవయవాల్లో రక్తం గట్టిపడటం, గడ్డకట్టడం వంటి సంకేతాలు కనపడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగా వైరస్ శరీరాన్ని నాశనం చేసే అవకాశం ఉందని యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడాకు చెందిన డాక్టర్ స్కాట్ బ్రాకెన్‌రిడ్జ్ హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో అవయవాలు పనిచేయకపోవడానికి కూడా కొవిడ్-19 కారణంగా కనపడుతోందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. కరోనా పేషంట్లలో కిడ్నీ డయాలసిస్ కాథెటర్స్ గడ్డకట్టడాన్ని నెఫ్రాలజిస్ట్‌లు గమనిస్తున్నారు. మరోపక్క కరోనా సోకిన వారి ఊపిరితిత్తుల భాగాలు రక్తరహితంగా ఉన్నాయని పల్మనాలజిస్ట్‌లు చెబుతున్నారు. కొవిడ్-19 ఇన్ని రకాలుగా శరీరానికి హాని కలిగిస్తుండటంతో అమెరికన్ వైద్యులు కొత్త ప్రొటోకాల్‌ను అభివృద్ధి చేశారు. పేషంట్ల రక్తం గడ్డ కడుతున్నట్టు సంకేతాలు లేనప్పటికి.. ముందుగానే రక్తం సన్నపడటానికి అధిక మోతాదులో డ్రగ్‌ను ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. వెంటిలేటర్‌పై సుదీర్ఘ కాలం పాటు చికిత్స పొందుతున్న, అనారోగ్యంతో ఉన్న వారిలో క్లాటింగ్ అనేది మొదలవుతుందని.. కరోనా పేషంట్ల విషయానికి వస్తే ఈ ప్రక్రియ వేగంగా మొదలవుతోందని వైద్యులు చెబుతున్నారు. 

Read more