ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే భారత ప్రవాసులకు కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి: సౌదీ
ABN , First Publish Date - 2020-06-16T19:23:45+05:30 IST
గల్ఫ్ నుంచి చార్టెడ్ విమానాల్లో కేరళ రాష్ట్రానికి వెళ్లే భారత ప్రవాసులకు సౌదీ అరేబియాలోని భారత ఎంబసీ కీలక సూచన చేసింది.

రియాధ్: గల్ఫ్ నుంచి చార్టెడ్ విమానాల్లో కేరళ రాష్ట్రానికి వెళ్లే భారత ప్రవాసులకు సౌదీ అరేబియాలోని భారత ఎంబసీ కీలక సూచన చేసింది. శనివారం నుంచి తప్పనిసరిగా ప్రవాసులు కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపిస్తేనే స్వదేశానికి ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కేరళ ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత ఎంబసీ పేర్కొంది. కనుక ప్రతి కేరళ ప్రవాసి కరోనా పరీక్షలు చేయించుకుని నెగెటివ్ వస్తేనే అతను లేదా ఆమె ప్రయాణించడానికి అనుమతి లభిస్తుంది. చార్టెడ్ విమానాల కోసం భారత రాయబార కార్యాలయం తాజాగా ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ చూపించిన వారికి మాత్రమే విమానాల్లో అనుమతి ఇవ్వాలని నార్కా ప్రధాన కార్యదర్శి కే. ఎలగోవన్ పేర్కొన్నారు.