కరోనా నుంచి కోలుకున్నా.. వెంటాడనున్న దీర్ఘకాలిక అనారోగ్యాలు?!
ABN , First Publish Date - 2020-05-19T03:25:10+05:30 IST
కరోనా నుంచి కోలుకున్న పేషంట్లు ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించి

బీజింగ్: కరోనా నుంచి కోలుకున్న పేషంట్లు ఊపిరితిత్తులు, గుండెకు సంబంధించి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్(ఎన్‌హెచ్‌ఎస్) వెల్లడించింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా ఇన్‌ఫెక్షన్‌తో శరీర అవయవాలపై ప్రతికూల ప్రభావం కనిపిస్తున్నట్టు ఎన్‌హెచ్‌సీ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న తర్వత దీర్ఘకాలం అనారోగ్యం వెంటాడనున్నట్టు పేర్కొంది. ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యల తీవ్రత అధికమయ్యే అవకాశం ఉందని చెప్పింది. వీటితో పాటు మానసిక సమస్యలూ వెంటాడే అవకాశమున్నట్టు తెలిపింది. మరోపక్క కరనా నుంచి కోలుకున్న వారి మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజీని కూడా ఎన్‌హెచ్‌ఎస్ పెంచింది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ మార్గదర్శకాలకు సంబంధించి సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం రాసింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య పెరిగే కొద్దీ రీహ్యాబిలిటేషన్ అవసరాలు ప్రముఖంగా మారుతున్నాయని కథనంలో రాసుకొచ్చింది. కాగా.. చైనాలో ఇప్పటివరకు మొత్తంగా 78,227 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక చైనాలో ఇప్పటివరకు 82,954 మంది కరోనా బారిన పడగా.. 4,634 మంది మృత్యువాతపడ్డారు.