యూఏఈలో క‌రోనా విజృంభణ.. ఒకేరోజు 525 కేసులు

ABN , First Publish Date - 2020-04-25T17:58:50+05:30 IST

గ‌ల్ఫ్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖ‌తార్‌లో ఈ వైర‌స్ తీవ్ర‌త అధికంగా ఉంది.

యూఏఈలో క‌రోనా విజృంభణ.. ఒకేరోజు 525 కేసులు

యూఏఈ: గ‌ల్ఫ్‌లో మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖ‌తార్‌లో ఈ వైర‌స్ తీవ్ర‌త అధికంగా ఉంది.  యూఏఈలో శుక్రవారం ఒకేరోజు 525 కొత్త కేసులు నమోదైన‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బారిన ప‌డిన‌వారి సంఖ్య 9,281కి చేరింది. ఎనిమిది మంది మ‌ర‌ణించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 64 మంది చనిపోయారు.‌ 123 మంది కోలుకోవ‌‌డంతో మొత్తం సంఖ్య‌ 1,760 అయ్యింది. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1.97లక్షలకు చేరింది. 28 లక్షలకు పైగా బాధితులు ఉన్నారు.

Updated Date - 2020-04-25T17:58:50+05:30 IST