వ్యాక్సిన్ రాకముందే కరోనా మాయం కావచ్చు: ఇటలీ డాక్టర్

ABN , First Publish Date - 2020-06-22T07:32:33+05:30 IST

కొవిడ్-19కు వ్యాక్సిన్ కనుగొనక ముందే వైరస్ మాయమయ్యే అవకాశముందని

వ్యాక్సిన్ రాకముందే కరోనా మాయం కావచ్చు: ఇటలీ డాక్టర్

రోమ్: కొవిడ్-19కు వ్యాక్సిన్ కనుగొనక ముందే వైరస్ మాయమయ్యే అవకాశముందని ఇటలీకి చెందిన ప్రముఖ వైద్యుడు చెబుతున్నారు. మార్చి, ఏప్రిల్ నెలలతో పోల్చితే కరోనా శక్తి తగ్గిందంటూ ఇటలీలోని శాన్ మార్టినో ఆసుపత్రిలో ఇన్‌ఫెక్షస్ డిసీజెస్ క్లినిక్‌కు హెడ్‌గా ఉన్న డాక్టర్ మ్యాటియో బాసెట్టీ తెలిపారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో వయసు పైబడిన పేషంట్లకు వెంటిలేషన్ ఎక్కువగా అవసరం అయ్యేదని.. కానీ ఇప్పుడు 80, 90 ఏళ్ల వయసున్న వారు కూడా ఎటువంటి సహాయం లేకుండా శ్వాస తీసుకోగలుగుతున్నారని ఆయన అన్నారు. జెనెటిక్ మ్యుటేషన్స్(జన్యు ఉత్పరివర్తనలు) కారణంగానే కరోనా శక్తి తగ్గినట్టు డాక్టర్ మ్యాటియో చెబుతున్నారు. అంతేకాకుండా లాక్‌డౌన్, భౌతిక దూరం, ఫేస్ మాస్క్ ధరించడం ద్వారా వైరల్ లోడ్ కూడా తక్కువగా ఉందని అన్నారు. దీంతో పాటు రోగ నిరోధక వ్యవస్థ వైరస్‌‌తో పోరాడుతుండటంతో వైరస్ పరివర్తన చెందిందన్నారు. వైరస్ బారిన పడే వారు కూడా తక్కువగానే ఉన్నారని.. చివరకు వ్యాక్సిన్ రాకుండానే ఈ మహమ్మారి మాయమైపోవచ్చని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. అనేక మంది నిపుణులు మాత్రం కరోనా మహమ్మారి మాయమవడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని చెబుతున్నారు. కరోనా వైరస్ ఎప్పుడైతే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదో ఆ రోజు మాత్రమే మాయమవుతుందని యూకేలోని ఓ మెడికల్ నిపుణుడు చెప్పారు.

Updated Date - 2020-06-22T07:32:33+05:30 IST