కరోనాకు వ్యాక్సీన్ అవసరం లేదు: ట్రంప్
ABN , First Publish Date - 2020-05-09T23:12:18+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది.
వాషింగ్టన్ డీసీ: అగ్రరాజ్యం అమెరికాను మహమ్మారి కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు శరవేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ వల్ల ప్రతిరోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతో అమెరికన్లకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇదిలాఉంటే తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 'కొవిడ్-19' విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాకు ఎలాంటి వ్యాక్సీన్ అవసరం లేదన్నారు. అంతేగాక తన అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా 95 వేల వరకు మరణాలు నమోదు కావొచ్చని అన్నారు. రిపబ్లికన్ పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, అగ్రరాజ్యంలో కరాళ నృత్యం చేస్తున్న కొవిడ్ వల్ల ఇప్పటి వరకు 77 వేలకు పైగా మరణాలు సంభవించాయి. అలాగే 13 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు.