అగ్రరాజ్యంలో మూడు లక్షల మార్క్‌ను దాటిన మరణాలు !
ABN , First Publish Date - 2020-12-15T14:30:55+05:30 IST
అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. అంతకంతకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి.

వాషింగ్టన్: అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. అంతకంతకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. సోమవారం కరోనా మరణాలు 3 లక్షల మార్క్‌ను దాటిందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రారంభించిన రోజే ఇలా మరణాలు 3 లక్షల మైలురాయిని చేరుకోవడం గమనార్హం. అలాగే దేశవ్యాప్తంగా కరోనా కేసులు 16.3 మిలయన్లకు చేరాయి. జాన్స్ హాప్కిన్స్ డేటాబేస్ ప్రకారం గడిచిన రెండు వారాలుగా అగ్రరాజ్యంలో తరచూ 2,500 కొవిడ్ మరణాలు నమోదవుతున్నాయి. గత బుధ, శనివారం రోజుల్లో మూడు వేల మరణాలు కూడా నమోదయ్యాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక మరణాలు, కేసులతో అమెరికా తొలిస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, సోమవారం అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో కరోనా ఉధృతి తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.