షాకింగ్: రోజుకు దాదాపు వెయ్యి కరోనా మరణాలు..!
ABN , First Publish Date - 2020-04-26T02:56:14+05:30 IST
కరోనా వైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అగ్రరాజ్యాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. బ్రిటన్‌లో గత 24 గంటల్లో మహమ్మారికి 813 మం

లండన్: కరోనా వైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అగ్రరాజ్యాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. బ్రిటన్‌లో గత 24 గంటల్లో మహమ్మారికి 813 మంది బలయ్యారు. దీంతో యూకేలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 20వేలు దాటింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5.17లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1.48లక్షల మందికి వైరస్ సోకిందని నిర్ధారణ అయింది. ఇదిలా ఉంటే.. బ్రిటన్‌లో కేవలం 13రోజుల్లోనే పదివేల మరణాలు సంభవించాయి. ఏప్రిల్ 12నాటికి కరోనా కారణంగా బ్రిటన్‌లో మరణించిన వారి సంఖ్య 10వేలు దాటింది. కేవలం 13రోజుల్లోనే బ్రిటన్‌లో కరోనా మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగి 20,319కి చేరింది. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 2లక్షలకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు దాదాపు 28. 63లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.
అమెరికాలో కరోనా కల్లోలం..
అమెరికాలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. వరల్డ్ఒమీటర్.ఇన్‌ఫోలోని సమాచారం ప్రకారం.. ఈ రోజు అమెరికాలో 3,138 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికా వ్యాప్తంగా కరోనా బారినపడ్డ వారి సంఖ్య 9.28లక్షలకు చేరింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. స్పెయిన్(2.23లక్షలు) , ఇటలీ(1.92లక్షలు), ఫ్రాన్స్(1.59లక్షలు), జర్మనీ(1.55లక్షలు), యూకే(1.48లక్షలు), టర్కీ(1.04లక్షలు) .. ఈ ఆరు దేశాల్లో సంభవించినన్ని కరోనా కేసులు ఒక్క అమెరికాలోనే నమోదయ్యాయి. అగ్రరాజ్యం ఆర్థిక రాజధానిగా భావించే న్యూయార్క్‌లో 2.77లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్ద మొత్తంలో ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశంలో కూడా కరోనా కేసులు నమోదు కాలేదు.