సౌదీలో కరోనా విజృంభణ.. నిన్న ఒక్కరోజే!

ABN , First Publish Date - 2020-07-27T20:48:23+05:30 IST

కరోనా వైరస్ సౌదీ అరేబియాలో విజృంభిస్తోంది. సౌదీలో కరోనా కేసులు, మరణాలు

సౌదీలో కరోనా విజృంభణ.. నిన్న ఒక్కరోజే!

రియాద్: కరోనా వైరస్ సౌదీ అరేబియాలో విజృంభిస్తోంది. సౌదీలో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వరల్డ్ఒమీటర్.ఇన్‌ఫోలోని సమాచారం ప్రకారం.. సౌదీలో ఆదివారం ఒక్కరోజే 1,968కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా 30 మంది మృత్యువాతపడ్డారు. కాగా.. దాదాపు 3.37కోట్ల జనాభా ఉన్న సౌదీలో ఇప్పటి వరకు 2.66లక్షల మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 2.20లక్షల మంది కొవిడ్-19ను జయించి, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదే సమయంలో 2,733 మంది కరోనా కాటుకు బలయ్యారు. కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో సౌదీ అరేబియా 13వ స్థానంలో ఉంది. 


Updated Date - 2020-07-27T20:48:23+05:30 IST