పిల్లలు జాగ్రత్త.. తల్లిదండ్రులకు వైద్యనిపుణుల హెచ్చరిక..!

ABN , First Publish Date - 2020-05-18T18:30:36+05:30 IST

కరోనా వైరస్ నేపథ్యంలో పిల్లల గురించి డాక్టర్లు, నిపుణులు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారి ప్రపంచానికి

పిల్లలు జాగ్రత్త.. తల్లిదండ్రులకు వైద్యనిపుణుల హెచ్చరిక..!

యూఏఈ: కరోనా వైరస్ నేపథ్యంలో పిల్లల గురించి డాక్టర్లు, నిపుణులు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారి ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3లక్షల కంటే ఎక్కువ మందిని బలితీసుకున్న మహమ్మారి.. చిన్నపిల్లలనూ వదలడం లేదని నిపుణలు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారినపడుతున్న పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. పిల్లల్లో కరోనా లక్షణాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ‘మొదట్లో కరోనా బారినపడుతున్న పిల్లల సంఖ్య తగ్గువగా ఉంది. కానీ ప్రస్తుతం ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పెద్దలతో సమానంగా చిన్నపిల్లలకు కరోనా ముప్పు పొంచివుంది. ఇటలీ, చైనా, న్యూయార్క్ దేశాల్లోని కరోనా కేసులు పరిశీలిస్తే.. కరోనా బారినపడిన కొందరు పిల్లల్లో కాళ్లు, చేతులకు దద్దుర్లు, నాలుక ఎర్రబడటం, తీవ్ర జ్వరం వంటి లక్షణాలు కనిపించాయి’ అని యూఏఈలోని అల్ జహ్రా ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్య నిపుణుడు ఒకరు తెలిపారు.

Updated Date - 2020-05-18T18:30:36+05:30 IST