ఘనీభవించిన ఆహారంపై వైరస్!
ABN , First Publish Date - 2020-11-26T09:40:43+05:30 IST
కరోనా వైరస్ వూహాన్ నుంచి వ్యాప్తి జరిగిందనే విషయాన్ని అంగీకరించని చైనా ఇప్పుడు ఇతర దేశాలపై ఆరోపణలు చేస్తోంది

బీజింగ్, నవంబరు 25: కరోనా వైరస్ వూహాన్ నుంచి వ్యాప్తి జరిగిందనే విషయాన్ని అంగీకరించని చైనా ఇప్పుడు ఇతర దేశాలపై ఆరోపణలు చేస్తోంది. పలు దేశాల నుంచి తమకు దిగుమతి అయ్యే ఘనీభవించిన(ఫ్రోజెన్) ఆహార పదార్థాల ప్యాకేజింగ్‌లపై కరోనా వైరస్ జాడను గుర్తించామని చెబుతోంది. జూన్ నెలలో బీజింగ్ శివారులోని ఒక హోల్‌సేల్ ఫుడ్ మార్కెట్లోని ఫ్రోజెన్ రొయ్యల ప్యాకెట్‌పై కొవిడ్ వైర్‌సను గుర్తించారు. అప్పటి నుంచి దేశంలోని అన్ని నౌకాశ్రయాలు, విమానాశ్రయాల వద్ద ఉండే శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసే ఫ్రోజెన్ ఆహార పదార్థాల ప్యాకేజింగ్‌లకు పరీక్షలను చైనా ప్రారంభించింది. వాటి ఫలితాలను సాకుగా చూపుతూ 24 దేశాల నుంచి వచ్చే ఫ్రోజెన్ రొయ్యలు, చేపలు, మాంసం దిగుమతులపై నిషేధాన్ని విధించింది.