కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి దిశగా చైనా మరో అడుగు

ABN , First Publish Date - 2020-06-22T13:53:13+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి దిశగా చైనా మరో అడుగు ముందుకు వేసింది. చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌సకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ బయాలజీ శాస్త్రవేత్తలు త

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి దిశగా చైనా మరో అడుగు

  • చైనా శాస్త్రవేత్తల ముందడుగు


బీజింగ్‌, జూన్‌ 21 : కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి దిశగా చైనా మరో అడుగు ముందుకు వేసింది. చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌సకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ బయాలజీ శాస్త్రవేత్తలు తయారు చేసిన వ్యాక్సిన్‌తో మనుషులపై రెండో దశ ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీనిలో సానుకూల ఫలితాలను సాధించి మూడోదశలోనూ సఫలమైతే ఔషధ నియంత్రణ సంస్థల అనుమతితో వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి విక్రయాలు జరపడమే తరువాయి!! మనుషులపై తొలి దశ ప్రయోగాల్లో భాగంగా మే నుంచి ఇప్పటివరకు 200 మంది వలంటీర్లపై ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను పరీక్షించామంటూ ఐఎంబీ తన సోషల్‌ మీడియా చానల్‌లో ప్రకటించుకుంది. 


Updated Date - 2020-06-22T13:53:13+05:30 IST