ఆందోళన కలిగిస్తున్న తాజా కథనం.. కరోనా నుంచి కోలుకున్న వారికి..!
ABN , First Publish Date - 2020-05-18T14:30:45+05:30 IST
కరోనా ఇన్ఫెక్షన్ సోకితే శరీరంలోని అవయవాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ‘సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపింది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్(ఎన్‌హెచ్‌సీ)

బీజింగ్, మే 17 : కరోనా ఇన్ఫెక్షన్ సోకితే శరీరంలోని అవయవాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ‘సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపింది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్(ఎన్‌హెచ్‌సీ) తాజా మార్గదర్శకాలే అందుకు ఆధారమంటూ ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది. కరోనా నుంచి కోలుకున్న వారు దీర్ఘకాలంలో ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చని ఆ మార్గదర్శకాల్లో ప్రస్తావించారు. కండర క్షయం, మానసిక సమస్యలతోనూ సతమతం కావొచ్చని ఎన్‌హెచ్‌సీ పేర్కొంది.