వీడియో: లాస్‌ ఏంజిల్స్‌ నగరాన్ని జన్మలో ఇలా చూడలేం

ABN , First Publish Date - 2020-04-27T02:48:59+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచదేశాలు స్తంభించిన విషయం తెలిసిందే.

వీడియో: లాస్‌ ఏంజిల్స్‌ నగరాన్ని జన్మలో ఇలా చూడలేం

లాస్ ఏంజిల్స్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచదేశాలు స్తంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జన్మలో ఎన్నడూ చూడని విధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మారాయి. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరం అంటేనే నిత్యం వేలాది మంది ప్రజలతో బిజీ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా లాస్ ఏంజిల్స్ నగరం సరికొత్తగా మారింది. లాక్ డౌన్‌తో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. మరోపక్క షాపులు, ఆఫీసులు కూడా పూర్తిగా మూతపడ్డాయి. దీంతో రోడ్లమీద ఎక్కడా ట్రాఫిక్ కనిపించడం లేదు. లాస్ ఏంజిల్స్ నగరాన్ని చూస్తున్న వారు జన్మలో మరోసారి ఇలా చూడలేమంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 9,64,075 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మొత్తంగా 54,375 మంది మృతిచెందారు. ఇక కాలిఫోర్నియా రాష్ట్రంలో మొత్తంగా 41,137 కేసులు నమోదు కాగా.. 1,651 మంది మరణించారు.

Updated Date - 2020-04-27T02:48:59+05:30 IST