ఆ ఫ్యాన్లు వాడటం వెంటనే ఆపేయమంటూ.. అమెరికాలో..
ABN , First Publish Date - 2020-12-30T04:31:54+05:30 IST
అమెరికాలోని ఓ ఫ్యాన్ కంపెనీకి చెందిన ఫ్యాన్లను వాడటం ఆపేయాలంటూ యూఎస్ కన్‌జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ హెచ్చరించింది.
న్యూయార్క్: అమెరికాలోని ఓ ఫ్యాన్ కంపెనీకి చెందిన ఫ్యాన్లను వాడటం ఆపేయాలంటూ యూఎస్ కన్‌జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ హెచ్చరించింది. వివరాల్లోకి వెళ్తే.. ‘కింగ్ ఆఫ్ ఫ్యాన్స్’ అనే సంస్థ 1.8 లక్షలకు పైగా ఫ్యాన్లను వినియోగదారులకు అమ్మింది. అయితే ఫ్యాన్ వేయగానే రెక్కలు ఊడిపోతున్నాయంటూ 47 మంది కస్టమర్లు సంస్థకు ఫోన్లు చేశారు. ఫ్యాన్ రెక్కలు ఊడిపోవడం వల్ల తమకు ఆస్తి నష్టం జరిగిందంటూ నలుగురు కస్టమర్లు, రెక్కలు ఊడిపోయి తమకు తగలడంతో గాయాలైనట్టు ఇద్దరు కస్టమర్లు రిపోర్ట్ చేశారు. దీంతో సేఫ్టీ కమిషన్ వెంటనే రంగంలోకి దిగింది. ఆ ఫ్యాన్లు వాడటం ప్రమాదమంటూ హెచ్చరించింది. దాదాపు రెండు లక్షల మంది ఈ ఫ్యాన్లను కొనుగోలు చేయడంతో వారందరికి ఫ్యాన్లను వాడటం వెంటనే ఆపేయాలంటూ సూచించింది. మరోపక్క ఫ్యాన్ సంస్థ సైతం కస్టమర్లకు ఫోన్లు చేస్తూ సమాచారమిస్తోంది.