కరోనా బారిన పడ్డ మరో దేశ ప్రథమ మహిళ

ABN , First Publish Date - 2020-11-26T04:53:14+05:30 IST

కొలంబియా ప్రథమ మహిళ మేరియా జూలియానా రూయిజ్ కరోనా బారిన పడ్డారు. ఆమెకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో

కరోనా బారిన పడ్డ మరో దేశ ప్రథమ మహిళ

బొగోటా: కొలంబియా ప్రథమ మహిళ మేరియా జూలియానా రూయిజ్ కరోనా బారిన పడ్డారు. ఆమెకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఫలితం పాజిటివ్ వచ్చినట్టు ప్రభుత్వం మంగళవారం తెలిపింది. అయితే ఆమెలో ఎటువంటి కరోనా లక్షణాలు లేనట్టు పేర్కొంది. అధ్యక్షుడు ఇవాన్ డూక్యూ, ప్రథమ మహిళ మేరియా నిత్యం అనేక మందితో సమావేశం అవుతున్నందున.. వారికి నిత్యం కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే సోమవారం కూడా ఇవాన్, మేరియాకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఇవాన్‌కు నెగిటివ్.. మేరియాకు పాజిటివ్ వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. మేరియా ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నట్టు ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు తెలిపింది. ఇదిలా ఉంటే.. నెల రోజుల క్రితం కొలంబియా ఉపాధ్యక్షుడు మార్తా లూసియా రామిరెజ్ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన అమెరికా, బ్రెజిల్ దేశాలకు చెందిన ప్రథమ మహిళలు కూడా ఇప్పటికే కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్నారు. కాగా.. కొలంబియాలో ఇప్పటివరకు మొత్తం 12 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి 35,479 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-11-26T04:53:14+05:30 IST